Dhanush: ధనుష్ ‘ఇడ్లీ కడై’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తిని పెంచుతున్న పోస్టర్

by Hamsa |
Dhanush: ధనుష్ ‘ఇడ్లీ కడై’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆసక్తిని పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా డైరెక్టర్‌గా మారి తన చిత్రాలను తానే తెరకెక్కిస్తుండటం గమనార్హం. ఇటీవల ధనుష్ కెప్టెన్ మిల్లర్, రాయన్(Raayan) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. ప్రజెంట్ ఆయన స్వీయ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai) (ఇడ్లీ కొట్టు). అయితే ఇందులో నిత్యామేనన్(Nithya Menen) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్(Prakash Raj), షాలీనీ పాండే(Shalini Pandey) కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్(G. V. Prakash Kumar) సంగీతాన్ని అందిస్తున్నారు. దీనిని డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్(Wonder Bar Films) బ్యానర్స్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌కు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. 2025 ఏప్రిల్ 10న ‘ఇడ్లీ కడై’(Idli Kadai) వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రజెంట్ ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతోంది.

అయితే ఈ విషయాన్ని ధనుష్(Dhanush) కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. కాగా, ఏప్రిల్ 10 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ కూడా విడుదల కానుంది. ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రాబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed