- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Densuke Watermelon: ప్రపంచంలోనే అతి ఖరీదైన పుచ్చ 'డెన్సుకే బ్లాక్'!
దిశ, ఫీచర్స్ : వేసవిలో దాహర్తి తీర్చే అద్భుత ఫలం 'వాటర్ మెలన్'(Watermelon). ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే ఈ ఫ్రూట్ ఏడాది పొడవునా అందుబాటులో ఉన్నప్పటికీ సమ్మర్‌లో లభించేవే మధురంగా ఉంటాయి. ఇక మనకు ఎక్కువగా ఎరుపు రంగు పుచ్చకాయలే కనిపిస్తుంటాయి గానీ ప్రపంచవ్యాప్తంగా 1,200కు పైగా రకాలను పండిస్తున్నారు. సాధారణంగా వీటి ధర కిలోకు రూ. 20 నుంచి మొదలవుతుండగా.. 'డెన్సుకే బ్లాక్' రకం అత్యంత ఖరీదైనది గా ప్రసిద్ధి పొందింది. వాటికి ఎందుకంత ప్రత్యేకతనో తెలుసుకుందాం.
ప్రపంచంలోని అరుదైన పుచ్చకాయల్లో 'డెన్సుకే'(Densuke Watermelon) ఒకటి. ఇవి ఉత్తర ద్వీపమైన 'హొక్కయిడో' లో మాత్రమే పెరుగుతాయి. తక్కువ పరిమాణంలో ఏడాదికి 100 యూనిట్లకు మించకుండా పెరిగే ఈ పండ్లు.. ఎక్కడ పడితే అక్కడ లభించవు. అందుకే వేలాది రూపాయలు కోట్ చేసిన అత్యధిక బిడ్డర్‌కు వేలంలో విక్రయిస్తారు. ఈ మేరకు 2019లో 750,000 జపనీస్ యెన్ ($6,000)కు వేలంలో విక్రయించబడి, చరిత్రలో అత్యంత ఖరీదైన పుచ్చకాయగా రికార్డ్ కొల్లగొట్టింది. పాండమిక్ కారణంగా గత రెండేళ్లలో ధరలు పడి పోయినా.. ఈ పుచ్చకాయ మాత్రం ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన రకంగా కొనసాగుతోంది.
ఇతర పుచ్చకాయ రకాల కంటే ఎక్కువ తీపిని కలిగి ఉండే ఈ పండ్లలో తక్కువ విత్తనాలు ఉంటాయి. ఇక వేలంలో కాకుండా సాధారణంగా ఒక్కో ఫలాన్ని దాదాపు $250కు కొనుగోలు చేయవచ్చు. చాలా దేశాల్లో ఒక పండు కోసం చెల్లిస్తున్న అధిక మొత్తంగా ఈ ధరను చెప్పవచ్చు. క్యూబిక్ కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో ప్యాక్ చేయబడే ఈ పుచ్చకాయలు ప్రస్తుతానికి జపాన్‌కే పరిమితం కాగా.. యూరప్, ఉత్తర అమెరికాల్లోనూ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం.
- Tags
- watermelon