బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలు..యనమల రామకృష్ణుడు

by Manoj |   ( Updated:2022-06-19 06:03:16.0  )
బీసీలపై కక్ష సాధింపులో భాగమే కూల్చివేతలు..యనమల రామకృష్ణుడు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని బీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రెండు రోజుల క్రితం జరిగిన మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి గళమెత్తినందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడలు కూల్చడం సిగ్గుచేటు అని విమర్శించారు. అక్రమ కట్టడం అంటూ పోలీసులు, ఇతర అధికారులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇవ్వకుండా.. గోడ కూల్చేసిన తర్వాత ముసుగు వేసుకుని ఒక వ్యక్తిని పంపించి ఇంటి లోపల నోటీసు పత్రాలను విసిరి వెళ్లారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన తాడేపల్లిలోని తుగ్లక్ కు మాత్రమే వస్తాయని మరోసారి నిరూపితమైంది అంటూ ధ్వజమెత్తారు. 'అక్రమ కట్టడమైతే.. తెల్లవారు జామున 4 గంటలకు ఆర్డీవో, ఎస్పీ సహా వందలాది మందితో రావాల్సిన అవసరం ఏమిటి.? జగన్ రెడ్డి పాలనలో మగ్గిపోతున్న ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్ర్యం కోసం మరో స్వాతంత్ర ఉద్యమం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తుగ్లక్ ప్రభుత్వంపై పోరాడుతాం. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం' అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed