- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Thokkudu Laddu: దీపావళి స్పెషల్.. ఇంటిల్లిపాదికి నచ్చే హోమ్ మేడ్ తొక్కుడు లడ్డూ రెసిపీ
దిశ, వెబ్‌డెస్క్: దీపావళికి చాలా మంది రకరకాల స్వీట్స్(Sweets) తయారు చేస్తారు. కొంతమంది రిస్క్ ఎందుకని మార్కెట్‌లో స్వీట్లను కొనుగోలు చేస్తారు. స్వీట్లలో లడ్డుకు మరింత ఫ్యాన్స్ ఉంటారు. లడ్డూ(Laddu) పేరు చెప్పగానే నోట్లో నీళ్లు ఉరుతాయి. పైగా లడ్డూలో తొక్కడు లడ్డూ(Thokkudu Laddu) అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడుతారు. కాగా దీపావళి(Deepavali)కి బయట స్వీట్స్ కొనే బదులు ఈ సింపుల్ లడ్డూను ఇంట్లోనే తయారు చేసుకోండి. మీ అతిథులకు, ఇంటిల్లిపాదికి బాగా నచ్చుతుంది. మరీ తొక్కుడు లడ్డూ విధానమేలాగో ఇప్పుడు చూద్దాం..
తొక్కుడు లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు..
ఒక కప్పు షుగర్, శెనగపిండి-అరకిలో, ఒకటిన్నర స్ఫూన్ యాలకుల పొడి, నెయ్యి - 6 స్పూన్లు, డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్, చిటికెడు సాల్ట్ తీసుకోవాలి.
తయారీ విధానం..
ముందుగా ఒక బౌల్ తీసుకుని శెనగపిండి(besan flour),వాటర్ పోసుకుని బాగా కలిపి.. చపాతీ పిండి(Chapati flour)లా తయారు చేసుకోవాలి. తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టి ఆయిల్ పోసి.. పిండిని జంతికిల గొట్టంలో వేసి జంతికిల్లా నూనెలో వేయాలి. మొత్తం వేయించడం అయ్యాక.. ఒక గిన్నెలోకి తీసుకుని చిన్నగా విరుచుకోవాలి. అనంతరం ఈ ముక్కల్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. దీనిలో షుగర్, చిటికెడు సాల్ట్, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టుకుంటే అంతే. రుచికరమైన తొక్కుడు లడ్డూ తయారైనట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు వదలరు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.