నవీన్ భౌతికకాయం ఇండియాకు.. రిసీవ్ చేసుకోనున్న సీఎం బస్వరాజ్

by Nagaya |
నవీన్ భౌతికకాయం ఇండియాకు.. రిసీవ్ చేసుకోనున్న సీఎం బస్వరాజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మార్చి 1న భారతీయ విద్యార్థి నవీన్ మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. అయితే, చనిపోయిన నవీన్ భౌతికకాయాన్ని సైతం తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎంబసీ ప్రయత్నాలు చేసింది. దీంతో నవీన్ భౌతికకాయాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యింది.

ఈ క్రమంలో సోమవారం ఉదయం 3 గంటలకు నవీన్ భౌతికకాయం బెంగళూరుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా స్వయంగా కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై విమానాశ్రయానికి చేరుకొని భౌతికకాయానికి నివాళి అర్పించి.. అనంతరం హవేరి జిల్లాకు తరలించి నవీన్ కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

Advertisement

Next Story