Kriti Sanon: యంగ్‌ హీరోతో డేటింగ్‌.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కృతి సనన్?

by Hamsa |   ( Updated:2024-11-06 07:07:45.0  )
Kriti Sanon: యంగ్‌ హీరోతో డేటింగ్‌.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కృతి సనన్?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్‌’లో సీతగా నటించి మెప్పించింది. ఇటీవల ‘దో పత్తీ’(Do Patti) మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. కృతి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా ‘భూల్ భులయ్యా-3’(Bhool Bhulayya-3) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తిక్ ఆర్యన్‌(Karthik Aryan)తో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.

అంతేకాకుండా త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రజెంట్ ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘నేను సింగిల్, ఎవరికీ లైవ్ లొకేషన్ పంపాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతం ఏ డేటింగ్ యాప్‌(dating app)లలోనూ లేను. ‘చందు ఛాంపియన్‌’(Chandu Champion) కి సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉన్నాను నాకు డేటింగ్ చేసే టైమ్ లేదు. భూల్ భులయ్యా-2 షూటింగ్ పూర్తి చేయడం పెద్ద సవాలుగా ఉంది. అందు వల్ల వీటి గురించి ఆలోచించడానికి సమయం లేకుండా బిజీగా ఉన్నా’’ అని చెప్పుకొచ్చాడు.


Read More..

Samantha: నీ ప్రేమే నాకు బలం.. సమంత ఎమోషనల్ కామెంట్స్

Advertisement

Next Story