ధరణి పోర్టల్‌తో దళితుల భూములు స్వాహా

by Nagaya |
ధరణి పోర్టల్‌తో దళితుల భూములు స్వాహా
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ​ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి దళితుల భూములను స్వాహా చేస్తున్నదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ఏలేటి మహేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ సారధ్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రాం వరకు జరుగుతున్నసర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. భూ సమస్యలపై కాంగ్రెస్​ పోరాటం చేస్తుందన్నారు.

టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి దళితులు, గిరిజనులు, పేదల భూములను లాక్కోవడం తగదన్నారు. భూదానోద్యమ పితమహుడు ఆచార్య వినోభభావే స్పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. టీఆర్ఎస్​పార్టీ చేస్తున్న నష్టాలను ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ గద్దె దించుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed