- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తగ్గనున్న వంట నూనె ధరలు
దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలకు ఆయిల్ పరిశ్రమ గుడ్ న్యూస్ తెలిపింది. రష్యా- ఉక్రేయిన్‌ల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. దీని కారణంగా యూరోపియన్ దేశాలు, అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో, రష్యాతో కొనసాగే ఎగుమతి దిగుమతులకు ఆటకం ఏర్పడింది. దీంతో పలురకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. అంతే కాకుండా రష్యా నుంచి దిగుమతి చేసుకునే పెట్రోల్, ముడి పదార్థాలు, అలాగే స్టీల్ లాంటి వస్తువులపై యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వంట నూనెల ధరలు ఆల్ టైం రికార్డు సృష్టిస్తున్నాయి. మనకు వచ్చే సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా దేశాల నుంచే వస్తోంది. అయితే డిమాండ్‌కు తగినంతగా సప్లై లేని కారణంగా నిన్నమొన్నటి వరకూ రూ. 110 పలికిన లీటర్ సన్ ఫ్లవర్ నూనె ధర ఇప్పుడు అమాంతంగా రూ. 165 దాటేసింది.
నిత్యవసర వస్తువుల్లో వంట నూనె కూడా ఒకటి కావడంతో పెరిగిన వంట నూనె ధర సామాన్యులకు భారంగా మారనుంది. కానీ వీటన్నింటికి చెక్ పెడుతూ ఆయిల్ పరిశ్రమ సామాన్యులకు తీపి కబురు అందించింది. వంట నూనె ధరలు రెండు రోజుల్లో తగ్గనున్నాయని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. యుద్ధం ప్రారంభానికి ముందే 1.5 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ నూనెతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన నౌక త్వరలోనే మన దేశానికి రానున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా వంట నూనె ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఆయిల్ పరిశ్రమ తెలిపింది.