- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో నిరుద్యోగులు లేరు!
దిశ, షాద్ నగర్: రాష్ట్రంలో కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో నిరుద్యోగులు లేరని, అధికారం పోతుందని అర్ధమయ్యే.. మళ్ళీ నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసాడని షాద్ నగర్ నియోజకవర్గ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం కేశంపేట మండల పరిధిలోని భైర్ ఖాన్ పల్లి గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టిందని, నియంతృత్వపోకడతో అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారన్నారు. పిజి, పిహెచ్‌డి లు చేసి ఉద్యోగాలు రాక గ్రామాలకు వచ్చి తల్లిదండ్రులకు మొఖం చూపించలేక ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వడం లేదన్నారు.
గ్రామాలలో నాయకుల ఇండ్లు ఒకటి పోయి రెండు, మూడు ఇలా పెరుగుతున్నాయి.. కానీ గ్రామాల్లో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 108 సేవలు, సీలింగ్ పట్టాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీదేనని శంకర్ అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, కుల సంఘాలు, మేధావులు నమ్మలేక ఈ ప్రభుత్వం పై వ్యతిరేక పోరాటాలు చేస్తున్నాయన్నారు. అన్ని వర్గాల వారు కలిసి టీఆర్ఎస్ ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. ఉపఎన్నికలు వచ్చిన వద్ద హామీలు ఇస్తూ.. కనీసం వాటిని నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, కాంగ్రెస్ ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు రూపా నాయక్, నాయకులు కరుణాకర్ రెడ్డి, తుమ్మల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.