- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగాల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి: కాంగ్రెస్
దిశ, బోథ్: శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రకటనను స్వాగతిస్తూనే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దళితులకు 3 ఎకరాల భూమి, రెండు పడక గదుల నిర్మాణం లాగా కాకుండ ఉద్యోగాల భర్తీ ఖచ్చితంగా చేయాలని బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే గజేందర్ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టిఎస్‌పిఎస్‌సి లో నలభై లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వయసు సడలింపు యూనిఫామ్ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బిసి లకు కనీసం 5 సంవత్సరాల వయసు సడలింపు ఇవ్వాలి.
ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లలో, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ భద్రత ఉండే విధంగా రోల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించాలన్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మిగిలిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కలిగించాలని, కోర్టు పరిధిలో ఉన్న వివిధ పోస్టుల క్లియరెన్స్ కు ప్రభుత్వం తరఫున హైకోర్టులో ప్రత్యేక ప్రజా ప్రయోజన వాజ్యం వెయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి రాబోవు ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే కావలసిన నిధులు కేటాయింపును చూపిస్తేనే నిరుద్యోగులు నమ్మే పరిస్థితి ఉంది కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ ఉద్యోగ ఉపాధి కల్పన లకు సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తూ కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మే మహేందర్, బజార్హత్నూర్ మండల అధ్యక్షుడు సామన్ పేల్లి శేఖర్, పట్టణ అధ్యక్షులు సల్ల రవి, కిసాన్ సెల్ జిల్లా నాయకుడు బోడ్డు గంగారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు బత్తుల రమేష్, గోదుమల్ల దినేష్ తదితరులు పాల్గొన్నారు.