వారిని మోసం చేసేందుకే ఆ పథకాన్ని తీసుకువచ్చారు: కాంగ్రెస్ నాయకులు

by Vinod kumar |   ( Updated:2022-03-06 11:06:35.0  )
వారిని మోసం చేసేందుకే ఆ పథకాన్ని తీసుకువచ్చారు: కాంగ్రెస్ నాయకులు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేటలో స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో రెండో రోజు ఆత్మగౌరవ దీక్ష.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో దళితులకు 'దళిత బంధు' పథకం అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు దళిత ఆత్మగౌరవ దీక్ష సభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేవలం ఉప ఎన్నిక నేపథ్యంలోనే హుజరాబాద్ లో ఓట్లు దండుకునేందుకే 'దళిత బంధు' పథకానికి సీఎం కేసీఆర్ తెరలేపారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని ఆరోపించారు.


డబుల్ ఇళ్లు, ఉద్యోగాలు, మూడెకరాల భూమి ఇలా అన్ని విషయాల్లో అన్యాయం జరిగిందన్నారు. మళ్లీ దళితులను మోసగించేసేందుకు 'దళిత బంధు' పథకాన్ని ముందుకు తీసుకువచ్చారు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే 'దళిత బంధు' అమలవుతుందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, పట్టణ అధ్యక్షుడు ఇమామ్, మండల అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, రాములు బర్మా రామచంద్రన్, దీక్షలో కూర్చున్న వారు దాసు రమేష్, మహేష్, నాగరాజు, బండి శివకుమార్, సయ్యద్ అతిక్ మజర్ మాలిక్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed