JNTUలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. మాంసం వండటమే గొడవకు కారణమా?

by Manoj |
JNTUలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. మాంసం వండటమే గొడవకు కారణమా?
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని కావేరీ హాస్టల్‌లో ఆదివారం విద్యార్థుల మధ్య ఘర్షణ చేలరేగింది. రామ నవమి రోజున మెస్‌లో మాంసాహారం వండుతున్నారని ABVP సభ్యులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష సభ్యులకు ABVP సభ్యుల మధ్య వాగ్వాదం జరిగి, గొడవకు దారి తీసింది. ఈ సంఘటనలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఇరువర్గాలకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారని రెండు వర్గాలు పేర్కొన్నాయి. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం 4 గంటలకు రాత్రి భోజనం కోసం మాంసం ప్యాకెట్లను సెక్రటరీ తీసుకోస్తున్నాడు. అయితే, ఏబీవీపీ విద్యార్థులు అతనిని అడ్డుకొని దాడి చేశారని వామపక్ష విద్యార్థులు ఆరోపించారు.

''విద్యార్థులందరూ కలిసి నిర్ణయించుకున్న హాస్టల్ మెస్ కమిటీ వేర్వేరు రోజులకు ఆహార మెనూని నిర్ణయిస్తుంది. ముందుగా నిర్ణయించిన మెస్ మెనూ ప్రకారం, ఆదివారం మాంసాహార విద్యార్థులకు మాంసాహారం వండుతారు. శాఖాహార విద్యార్థులకు పనీర్ తయారు చేస్తారు. అయితే, శ్రీరామ నవమి సందర్భంగా మాంసాహారం తయారు చేయడంపై ఏబీవీపీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. హాస్టల్ చుట్టూ రామనవమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మాంసాహారం వండకుండా చూస్తామని వారు చెప్పారు.'' అని ఫస్ట్ ఇయర్ పీహెచ్‌డీ విద్యార్థి అన్నారు.

కాగా, ఈ ఆరోపణలను JNU ABVP అధ్యక్షుడు రోహిత్ కుమార్ తోసిపుచ్చారు: "రామ నవమి సందర్భంగా విశ్వవిద్యాలయంలో పూజల చేస్తుండడంతో వామపక్షాలు, NSUI కార్యకర్తలు అల్లర్లు సృష్టించారు. మాంసాహారం అనేది అసలు సమస్యకాదని వారందరికీ రామ నవమి పూజలే సమస్య" అని అన్నారు. ఏబీవీపీ సభ్యులు ఏ విద్యార్థిపైనా దాడి చేయలేదని, మాంసాహారం తయారీలో ఎలాంటి ఆటంకాలు సృష్టించలేదని రోహిత్ తెలిపారు. ఈరోజు హాస్టల్‌లో విద్యార్థులు రామనవమి పూజను నిర్వహించారని, కొందరు వామపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ పూజకు అంతరాయం కలిగించారు. అయితే, తాము అనుకున్న విధంగానే పూజను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. వామపక్ష విద్యార్థులు పేర్కొంటున్నట్లుగా పూజ నిర్వహించడంలో లేదా ఏదైనా గందరగోళ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంలో ABVP ప్రమేయం లేదని రోహిత్ కుమార్ తెలిపారు.



Advertisement

Next Story

Most Viewed