జగిత్యాలలో దొంగ నోట్ల చెలామణి..

by Vinod kumar |
జగిత్యాలలో దొంగ నోట్ల చెలామణి..
X

దిశ, రాయికల్: నవంబర్ 8, 2016 న కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన నాటి నుంచి 25, జూన్ 2019 నాటికి నోట్ల చలామణీని 3.40 లక్షల కోట్ల (30408.68 బిలియన్ రూపాయల) మేర తగ్గించగలిగినట్లు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో తెలియజేసింది. నవంబర్ 8, 2016న 500, 1000 రూపాయల నోట్లను ప్రభుత్వం అప్పట్లో అకస్మాత్తుగా రద్దు చేసింది. నల్ల ధనం, దొంగ నోట్ల చలామణి ని అరికట్టడం, టెర్రరిస్టుల, మావోయిష్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయటం, సమాంతర ఆర్థిక వ్యవస్థగా రూపొందుతున్న చట్ట వ్యతిరేక ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే లక్ష్యంతో నోట్ల రద్దు నిర్ణయం చేసి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోందని గతంలో కేంద్రం తెలియజేసింది.


కానీ గత నెల రోజుల నుండి జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రద్దీగా ఉండే షాపుల్లోకి దొంగనోట్లు వస్తున్నాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో ఫిబ్రవరి నెలలో రూ.2000 నోటు, మార్చి నెలలో రూ.500 దొంగ నోటు ఇచ్చి ఓ దుకాణం నుండి సామాగ్రి కొనుగోలు చేశారని అట్టి నోట్లను ఉదయం పూట గమణిస్తేగాని దొంగ నోట్లని తెలియడం లేదని దుకాణాల ఉద్యోగస్తులు వాపోయారు. ఏది ఏమైనా రాయికల్ మండలం లో దొంగ నోట్లు చెలామణి అవుతున్నయనే అనుమానాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. అధికారులు విచారణ జరిపి దొంగ నోట్లు చెలామణికి అడ్డుకట్ట వేయాలని దుకాణాల వ్యాపారస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed