- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NSE కో-లొకేషన్ కేసులో రామకృష్ణకు బెయిల్ నిరాకరణ
దిశ, వెబ్‌డెస్క్: NSE కో-లొకేషన్ స్కామ్‌లో ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ ముందస్తు బెయిల్‌ను ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ రామకృష్ణకు బెయిల్ ఇవ్వడాన్ని గట్టిగా వ్యతిరేకించింది. కో-లొకేషన్ కేసులో రామకృష్ణ సలహాదారుగా పనిచేసిన ఎన్‌ఎస్‌ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. సుబ్రమణియన్‌ను చీఫ్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా నియమించడంలో, గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, MDకి సలహాదారుగా తిరిగి నియమించడంలో చిత్రాపై పాలనా పరమైన ఆరోపణలు వచ్చాయి. SEBI రామకృష్ణపై రూ.3 కోట్లు, చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, కంప్లైయన్స్ ఆఫీసర్‌గా ఉన్న VR నరసింహన్‌పై రూ.6 లక్షల జరిమానా విధించింది.
NSE కో-లొకేషన్ కేసు అంటే ఏమిటి?
NSE ఉన్నతాధికారులు 2010-2012 సమయంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సిస్టమ్‌కు కొంతమంది బ్రోకర్లకు ముందస్తు యాక్సెస్‌ను అందించారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సిస్టమ్‌ను ముందస్తుగా యాక్సెస్ చేయడం ద్వారా లాభాలను ఆర్జించారని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన OPG సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, ప్రమోటర్, స్టాక్ బ్రోకర్ సంజయ్ గుప్తా పై సీబీఐ కేసు నమోదు చేసింది. 2018 నుండి కో-లొకేషన్ స్కామ్‌ను విచారిస్తున్న సీబీఐ, అప్పటి ఎన్‌ఎస్‌ఇలోని ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సెబి నివేదిక అందిన తర్వాత చర్యకు దిగింది.