Chiranjeevi: జపాన్‌లో చిరంజీవి.. 10 రోజుల పాటు అక్కడే ఉండనున్న మెగాస్టార్!

by sudharani |
Chiranjeevi: జపాన్‌లో చిరంజీవి.. 10 రోజుల పాటు అక్కడే ఉండనున్న మెగాస్టార్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (vishwambhara). వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పలు పోస్టర్లు మూవీ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ చిత్రాల తర్వాత చిరంజీవి చేస్తున్న ఈ సోషియోఫాంటసీ (sociofantasy) చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి (Vamshikrishna Reddy), ప్రమోద్ ఉప్పలపాటి (Pramod Uppalapati) నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), అషిక రంగనాథ్‌ (Ashika Ranganath), ఇషా చావ్లా (Isha Chawla), సురభి (Surabhi), కునాల్‌ కపూర్‌ (Kunal Kapoor) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ జపాన్ (Japan) జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల మెగాస్టార్ కూడా జపాన్‌కు వెళ్లారు. అక్కడ 10రోజుల పాటు జరిగే కీలక షెడ్యూల్‌లో పాల్గొని ఈ మంత్ ఎండింగ్‌లో ఆయన ఇండియా తిరిగొస్తారని టాక్. కాగా.. సోషియోఫాంటసీ సినిమాగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో సృష్టి నాశనానికి ప్రయత్నించే దుష్టశక్తుల్ని హతమార్చడానికి పుట్టిన కారణజన్ముడిగా చిరంజీవి కనిపిస్తారు. ఇక ‘విశ్వంభర’ అనేది ఓ లోకం పేరు అని తెలుస్తుండగా.. అసలు ఆ లోకానికి, చిరంజీవికి పాత్రకు ఉన్న సంబంధం ఏంటీ అనేది కథ. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మేలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

Advertisement

Next Story