- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Children's Day Gifts: రొటీన్‌గా కాకుండా పిల్లలకు పెట్టుబడులు బహుమతిగా ఇవ్వండి.. ఇక భవిష్యత్తులో ఆందోళన అక్కర్లే!!
దిశ, వెబ్‌డెస్క్: ఇవాళ(నవంబరు 14)దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని(Childrens Day) సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేడు కొంతమంది పేరెంట్స్ పిల్లలకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటారు. సాధారణంగా పిల్లలకు ఏమిస్తారు..? పిల్లలందరూ ఇష్టపడే బొమ్మలు(toys), చాక్లెట్స్(Chocolates) ఎక్కువగా ఇస్తుంటారు. చాక్లెట్లు, బొమ్మలకు బదులుగా మీ పిల్లలకు 2024 చిల్డ్రన్స్ డే సందర్భంగ ఏదైనా ప్రత్యేక బహుమతిని ఇవ్వండి. ఎప్పుడూ రొటీన్‌గా కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండానికి పెట్టుబడుల్ని(Investments) గిఫ్ట్‌గా ఇస్తే.. పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.
పోస్టాఫీసు పథకం..
కాగా అందుకోసం పోస్టాఫీసు పథకం(Post Office Scheme)లో పెట్టుబడి పెట్టండి. దీంతో ఫ్యూచర్‌లో ఫైనాన్షియల్‌గా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. కాగా ఎఫ్‌డీ, ఆర్డీ వంటి పలు రకాల పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడిని మీ పిల్లల కోసం నేటి నుంచే స్టార్ట్ చేయండి. ఈ పథకం సురక్షితమే.. అంతేకాకుండా మెచ్యూరిటీ టైంలో వడ్డీ కూడా లభిస్తుంది.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)
మీ పిల్లల ఫ్యూచర్ కోసం SIP (Systematic Investment Plan) లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ప్రతి నెలా కొంత వరకు మనీ కట్టుకుంటే.. పిల్లలు పెద్దయ్యే సరికి లక్షల్లో ఫండ్ వస్తుంది. ఈ డబ్బు కాస్త పిల్లల చదువు కోసమైన లేదా ఆడపిల్లలుంటే వారి వివాహం కోసమే ఉపయోగపడుతుంది.
సుకన్య సమృద్ధి యోజన..
సుకన్య సమృద్ధి యోజన కూడా పిల్లలకు మంచి పథకం. 10 ఏళ్లు ఉన్న పిల్లలు ఈ పథకానికి అర్హులు. ఇది 15 ఏళ్ల పాటు కట్టాలి. 21 సంవత్సరాలు అయ్యాక రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వడ్డీగా మీకు 8. 2 శాతం వస్తుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్
నేషనల్ పెన్షన్ స్కీమ్(National Pension Scheme) కూడా పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ద్వారా నిర్వహించినిది. ఇందులో 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.
గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)
బాలల దినోత్సవం సందర్భంగా మీ పిల్లల పేరిట గోల్డ్ ఎక్ఛ్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(Gold Exchange Traded Funds) ద్వారా మనీ ఆదా చేయండి. తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి వస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని పొందవచ్చు.