బిగ్ బ్రేకింగ్: కేసీఆర్‌కు అస్వస్థత.. స్పందించిన వైద్యులు

by GSrikanth |   ( Updated:2022-03-11 06:29:12.0  )
బిగ్ బ్రేకింగ్: కేసీఆర్‌కు అస్వస్థత.. స్పందించిన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పలు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు పరిస్థితిని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్వీ రావు మాట్లాడుతూ.. 'రెండ్రోజులుగా వీక్‌గా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నాం. సీఎం ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ప్రకటనలో వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Next Story