భారీగా పెరిగిన కోడి మాంసం ధర.. కిలో ఎంతంటే?

by S Gopi |   ( Updated:2022-03-06 12:04:00.0  )
భారీగా పెరిగిన కోడి మాంసం ధర.. కిలో ఎంతంటే?
X

దిశ, బొంరాస్ పేట్: బాయిలర్ కోడి(ధర) కొండెక్కింది. రోజురోజుకీ చికెన్ ధరలు పెరుగుతుండటంతో మాంసం ప్రియులకు చికెన్ రేటు చుక్కలు చూపిస్తుంది. గత నెలలో కేజీ రూ.160-180 మధ్య ఉన్నది. కోళ్ల ఫారం గేటు రేటు కేజీ రూ.90 ఉండేది. కానీ.. ఇప్పుడు బాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం చికెన్ కేజీ రూ.250 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. కోళ్ల ఫారం గేటు రేటు కేజీ రూ. 140-150 మధ్య పలుకుతుంది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి చికెన్, గుడ్ల వినియోగం పెరిగింది. ఎండలు ముదిరితే వేడికి కోళ్లు చనిపోయే అవకాశం ఉండడంతో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతుండడంతో మాంసం ప్రియులకు ఇబ్బందులు తప్పేలా లేదు. చికెన్ ధరలతోపాటు మటన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ మటన్ రూ. 700 నుంచి 800 వరకు ఉంటుంది. వీటితోపాటు కూరగాయలు, నూనె మరియు పచ్చి మిర్చి ధర మంట పుట్టిస్తున్నాయి. కోళ్లకు వేసే ధాన రేటు, పెట్రోల్, డీజిల్ రేటుతోపాటు ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలు పెంపు కూడా పౌల్ట్రీ నిర్వహణ యజమానులకు భారమైంది. దీంతో మాంసం ధరలు పెరుగుతున్నాయి. గుడ్డు ధర కూడా పెరిగే అవకాశం ఉంది. మాంసం ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు మాంసాహారం అంటే వెనుకాడాల్సి వస్తుంది. దీంతో వారు చేసేది లేక గుడ్డుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed