- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chay- Shobhitha: శోభిత, చైతన్య పెళ్లికి గెస్టులు జాబితా రెడీ..! హాజరయ్యే సినీ ప్రముఖులు ఎవరెవరంటే..?
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకులు తర్వాత స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్లో ఉన్నట్లు కొన్ని పుకార్లు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా మీడియాకు చిక్కాయి. ఇక వీటన్నిటిని నిజం చేస్తూ రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున్ X వేదికగా ప్రకటిస్తూ వీరి నిశ్చితార్ధ ఫొటోలను షేర్ చేశాడు. కానీ పెళ్లి ఎప్పుడో తెలియజేయలేదు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడు అవుతదా అని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో తాజాగా శోభిత ధూళిపాళ పసుపు దంచుట కార్యక్రమం అంటూ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయని హింట్ ఇచ్చేసింది. ఇక చై, శోభితల పెళ్ళి డిసెంబర్ 4న జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చైతూ, శోభిత వివాహానికి సంబంధించిన గెస్టులు, ఆహ్వానితుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంబాల ప్రైవేట్ వ్యవహారంగా జరిగే ఈ పెళ్లి కోసం సెలెక్టెడ్‌గా ప్రముఖులను పిలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇరు కుటుంబాల సభ్యులు, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. అలాగే స్నేహితులు, సన్నిహితులను కూడా తమ జాబితాలో చేర్చినట్టు తెలుస్తున్నది. మరి సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఆ ప్రముఖులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
సినిమా పరిశ్రమ నుంచి చైతూ పెళ్లి వేడుకలో దగ్గుబాటి కుటుంబం, అలాగే మెగా ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ ఫ్యామిలీ, ఇతర కుటుంబాలను ఆహ్వానించనున్నట్టు తెలిసింది. ఇక సినిమా ఇండస్ట్రీలోని రాజమౌళి, ఇతర ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సినిమా నటులను ఆహ్వానించేందుకు సిద్దం అవుతున్నారు. చైతూ, శోభిత పెళ్లిని డిసెంబర్ 4వ తేదీన కనీవినీ ఎరుగని రీతిలో జరిపించేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 22 ఎకరాల్లో ఉన్న ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. పెళ్లి కోసం భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. అలాగే స్టూడియోను బ్రహ్మండంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.