- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షయ్ కుమార్‌పై చరణ్ ఫ్యాన్స్ తిట్ల దండకం..
దిశ, సినిమా : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ కొనసాగుతోంది. ప్రతి హీరో కూడా తోటి హీరోలు నటించిన చిత్రాలపై పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఇదే క్రమంలో ఒక భాషలో రిలీజైన ట్రైలర్‌ను ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ షేర్ చేయడం, అభినందించడం కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే షేర్ చేసిన హీరోకు థాంక్స్ చెప్పే విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం ఆ హీరో ఫ్యాన్స్‌తో మామూలుగా ఉండదు.
తాజాగా అక్షయ్ కుమార్ నటించిన 'రక్షా బంధన్' ట్రైలర్ విషయంలోనూ ఇదే జరిగింది. సదరు ట్రైలర్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాంచరణ్.. 'వాట్ ఏ ట్రైలర్' అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక ఆ పోస్టును రీట్వీట్ చేసిన అక్షయ్.. చరణ్‌కు థాంక్స్ చెప్పాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ట్వీట్‌లో రామ్ చరణ్‌ను 'అన్న' అని సంబోధించడంతో చెర్రీ ఫ్యాన్స్‌కు కోపమొచ్చింది. 'ఎవరు ఎవరికి అన్న? ఎప్పుడో భూమి పుట్టకముందు పుట్టావు. నీకు చరణ్ అన్ననా?' అంటూ అక్షయ్‌కు తన వయసు గుర్తుచేసిన మెగా ఫ్యాన్స్.. తమకు ఇష్టమొచ్చిన కామెంట్స్‌తో రెచ్చిపోయారు.
Thank you so much @AlwaysRamCharan Anna ❤️
— Akshay Kumar (@akshaykumar) June 28, 2022
And just like our birthday boy @aanandlrai the story of #RakshaBandhan is all heart! https://t.co/VcHDiGJib5