Chandini Chowdary : మరో ఓటీటీలోకి చాందిని చౌదరి కొత్త మూవీ..

by sudharani |   ( Updated:2024-10-18 14:11:47.0  )
Chandini Chowdary : మరో ఓటీటీలోకి చాందిని చౌదరి కొత్త మూవీ..
X

దిశ, సినిమా: యంగ్ బ్యటీ చాందిని చౌదరి (Chandini Chaudhary) ‘కలర్ ఫొటో’ మూవీతో కుర్రోళ్ల హృదయాలను గెలుచుకుంది. దీంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొత్తం మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ఇందులో ‘యేవమ్’ (yevam) ఒకటి. చాందిని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రకాష్ దంతులూరి (Prakash Dantuluri) దర్శకత్వం వహించాడు. ఇందులో వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషు రెడ్డి కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు.

జూన్ 14న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (aha)లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీలో వచ్చేసింది. ఈ మేరకు ‘యేవమ్’ (yevam) మూవీ ఇప్పుడు సన్ నెక్ట్స్ (Sun Nxt) లోకి వచ్చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

Advertisement

Next Story