రాత్రి 9 గంటలకు గట్టిగా అరిచిన మహిళ.. స్థానికులొచ్చేసరికీ..

by S Gopi |
రాత్రి 9 గంటలకు గట్టిగా అరిచిన మహిళ.. స్థానికులొచ్చేసరికీ..
X

దిశ, మల్లాపూర్: మహిళ మెడ నుండి మూడు తులాల బంగారు నగలను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించిన ఘటన మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో వాల్గొండ గ్రామానికి చెందిన చెపురి కళావతి అనే మహిళ అదే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై ఓ దొంగ వచ్చి బంగారు నగలను దొంగిలించినట్లు వివరించారు. మహిళ అరుపులు విని ప్రజలు అక్కడకు వెళ్లేసరికి దొంగ అక్కడి నుండి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న మల్లాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story