- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తాం': పోలీస్
దిశ, మణుగూరు: ప్రజల ప్రాణాలను సురక్షితంగా కాపాడటమే పోలీసుల లక్ష్యమని మణుగూరు మండల ఎస్సై బట్ట పురుషోత్తం అన్నారు. గురువారం మండలంలోని పూలమార్కెట్ చౌరస్తాలో మణుగూరు సబ్ డివిజన్ ఏఎస్పీ డాక్టర్ శబరిష్, సీఐ ముత్యం రమేష్ ఆదేశాలతో హెల్మెట్, వాహన ధ్రువ పత్రాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. కొంతమంది యువత రోడ్లపైన ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పారు. అలాగే వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గత కొన్ని రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్లపైన తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎంతటివారైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై వి.ఎల్.రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.