- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుతిన్‌కు యుద్ధం ఆపమని చెప్పాలా?: సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో రష్యా సంక్షోభంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము యుద్ధాన్ని ఆపమని పుతిన్‌ను ప్రశ్నించాలా అని వ్యంగ్యంగా స్పందించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను తీసుకురావాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం ఆయన స్పందించారు. 'కోర్టు దీనిపై ఏం చేస్తుంది? రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధం ఆపాలని నేను ఆదేశాలు ఇవ్వాలా?' అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోల్లో సీజేఐ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నవి వైరల్ అవుతున్నట్లు గుర్తుచేశారు. అయితే పిటిషనర్ స్పందిస్తూ 'ప్రజలు ఉక్రెయిన్‌లో నిలిచిపోతున్నారు. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి' అని కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. దీనిపై స్పందించిన కోర్టు 'ఎవరూ జాగ్రత్త తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అదే చేస్తుంది. మేము ఏజీని కనుక్కుంటాం' అని తెలిపింది. అంతేకాకుండా మీకు సాధ్యమైనంత మేరకు సాయం చేయాలని ఏజీ వేణుగోపాల్‌ను కోర్టు ఆదేశించింది. ఇప్పటికే భారత్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పౌరులను తరలించేందుకు కేంద్ర మంత్రులను పొరుగు రాష్ట్రాలకు పంపిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పౌరులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.