అవసరమైతే దేశం కోసం ప్రాణాలిస్తా: ఢిల్లీ సీఎం కేజ్రివాల్

by Harish |
అవసరమైతే దేశం కోసం ప్రాణాలిస్తా: ఢిల్లీ సీఎం కేజ్రివాల్
X

న్యూఢిల్లీ: తన ఇంటి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించడం పై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. అవసరమైతే తాను దేశం కోసం చావడానికైనా సిద్ధమని అన్నారు. ఢిల్లీలో ఈ-ఆటోల ప్రారంభ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. 'కేజ్రివాల్ ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. దేశం కోసం అవసరమైతే చనిపోతాను' అని అన్నారు. బుధవారం తన ఇంటి వద్ద ఆందోళనలపై స్పందిస్తూ, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పోరాటాలతో 75 ఏళ్లు వృథా చేశామని చెప్పారు. ఈ గూండాయిజం వల్ల దేశం అభివృద్ధి చెందలేదని, 21వ శతాబ్దపు భారతదేశం కోసం అందరూ కలిసి శాంతియుతంగా పని చేయాలని ఆయన అన్నారు.

కాగా, బుధవారం 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం పై కేజ్రివాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటిపై బీజేపీ యువ మోర్చా నిరసనకారులు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర విచారణకు గానూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు దిశానిర్దేశం చేయాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed