- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టూరిస్ట్‌లను ఆకర్షిస్తున్న ఇండియన్ ఆర్మీ 'కేఫ్స్'
దిశ, ఫీచర్స్ : శ్రీనగర్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో దావర్ ప్రాంతంలో 'ది లాగ్ హట్ కేఫ్' పేరుతో ఓ కాఫీడే ఉంది. దీన్ని గురేజ్ సెక్టార్ సరిహద్దును కాపాడే భారత సైన్యం నిర్వహిస్తుండటం విశేషం. ఈ సుదూర ప్రాంతానికి పర్యాటకులను పెంచేందుకు, ఉపాధి కల్పించేందుకు ఈ కేఫ్‌ను ప్రారంభించినట్లు ఆర్మీ అధికారి పేర్కొన్నాడు.
బోర్డర్ టూరిజంను ప్రోత్సహించే ఉద్దేశంతో అంతర్జాతీయ కాఫీ డే రోజున గతేడాది ఈ కేఫ్‌ను ఆర్మీ అధికారులు ప్రారంభించారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం సహా ఇలాంటి మరెన్నో కేఫ్స్, హోటల్స్ ప్రారంభించేందుకు కారకులయ్యారు. ప్రస్తుతం అక్కడ చాలా మార్పు రాగా గురేజ్‌లో పద్నాలుగు కంటే ఎక్కువ హోటళ్లు, హోమ్‌స్టేలు, రెంటెడ్ అకామిడేషన్ వెలియడంతో పర్యాటకులు భారీ సంఖ్యలో సందర్శిస్తున్నారు. ఈ మేరకు గతేడాది గురెజ్‌ని 15,000 మంది పర్యాటకులు సందర్శించగా, ఈ ఏడాది ఇప్పటికే 12,000 మంది విజిట్ చేశారు. ఈ సంవత్సరం వారి సంఖ్య 50,000 వరకు పెరుగుతుందని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ది లాగ్ హట్ కేఫ్ హోటల్‌కు సంబంధించిన వీడియో పంచుకుంటూ 'నాకు సంబంధించినంతవరకు, ఈ కేఫ్ 5 స్టార్ లేదా 7 స్టార్ కాదు, కానీ 10 స్టార్ గమ్యస్థానం' అని కామెంట్ చేశాడు.
వాజ్వాన్‌ను మించి సేవలందిస్తోంది..
సందర్శకులకు వాజ్వాన్ (కాశ్మీరీ వంటకాల్లో వడ్డించే గొర్రె మాంసంతో తయారు చేసిన మల్టిపుల్-కోర్స్ మీల్)ని మించి అత్యుత్తమ కేఫ్‌ను అందించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశాం. ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే చాలా తరచుగా దాన్ని పొందుతారు. కానీ స్థానిక చెఫ్స్ తయారు చేస్తున్న మ్యాగీ, పిజ్జా, పాస్తా, శాండ్‌విచ్ సహా ఇతర ఆహారాన్ని అందించాలనే ఆలోచన మాకుంది. స్థానికులకు మా కేఫ్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఇక బైకర్లు, ట్రెక్కర్లు, స్థానికులు మంచి కాఫీని ఆస్వాదించేందుకు సరైన ప్రదేశంగా మా కాఫీ డేను తీర్చిదిద్దాం. స్థానికులు, పర్యాటకుల కోసం వీకెండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, మ్యూజికల్ ఈవినింగ్స్ నిర్వహిస్తున్నాం. చాలా మంది స్థానిక కళాకారులు కేఫ్‌లో ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇది గురేజ్‌లో క్షీణిస్తున్న డార్డ్-షిన్ సంస్కృతిని పరిరక్షించడంలో సాయపడుతుంది'
- ది లాగ్ హట్ కేఫ్ యాజమాన్యం
మరిన్ని కేఫ్‌ల కోసం డిమాండ్
బారాముల్లా జిల్లాలోని సరిహద్దు పట్టణం ఉరీ స్థానికులు కూడా మారుమూల ప్రాంతంలో ఈ తరహా కేఫ్‌ను కోరుతున్నారు. 'గతేడాది మేలో, భారత సైన్యం ఉరీలోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) కమాన్ పోస్ట్ వద్ద సందర్శకుల కోసం ఒక కేఫ్‌ను తెరిచింది. అయితే ఇది ఎల్‌ఓసీ వద్ద, అత్యంత పటిష్టమైన జోన్‌లో ఉన్నందున స్థానికులకు పూర్తిగా అందుబాటులో లేదు' అని అధికారులు చెప్పారు. ప్రధాన ఊరిలో లేదా సలామాబాద్ ప్రాంతంలో కొత్త కేఫ్ తెరవాలని, సరైన పర్మిషన్ తర్వాత ప్రజలను అక్కడికి అనుమతిస్తామన్నారు.
J&K మీదుగా ఎల్‌ఓసీ గ్రామాలకు సమీపంలో ఇలాంటి మరిన్ని కేఫ్‌లను తెరిస్తే, సరిహద్దుకు ఇరువైపులా శాంతి నెలకొల్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.