టెస్లాను అధిగమించిన చైనా BYD.. ప్రపంచంలోనే టాప్ బ్రాండ్..

by Javid Pasha |   ( Updated:2022-07-06 13:05:06.0  )
BYD Auto Overtake Tesla In Global Electric Vehicle Sales
X

దిశ, వెబ్‌డెస్క్: BYD Auto Overtake Tesla In Global Electric Vehicle Sales| టెస్లా ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా కారు వినియోగదారుల్లో చాలా మందికి ఇది డ్రీమ్ కార్‌గా మారింది. అద్భుతమైన ఫీచర్లతో టెస్లా వినియోగదారులను తెగ ఆకట్టుకుంటుంది. దానికి తోడుగా ఈ కారు పూర్తిగా ఈవీ కావడంతో పర్యావరణ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. టెస్లా కార్లు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఈవీ కార్లను విక్రయించిన సంస్థగా టెస్లా రికార్డ్ సృష్టించింది. అయితే తాజాగా టెస్లా స్థానాన్ని చైనా సంస్థ BYD ఆక్రమించింది. 2022 మొదటి ఆరు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్)ను విక్రయించిన సంస్థగా బీవైడీ నిలిచింది. జనవరి నుంచి జూన్ నెల వరకు బీవైడీ సంస్థ 641,000 ఈవీ కార్లను విక్రయించింది. అదే సమయంలో టెస్లా 564,000 ఈవీ కార్లను అమ్మకాలను నమోదు చేసింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా చైనా లాక్‌డౌన్‌లు విధించడంతో టెస్లా సరఫరా, ఉత్పత్తిలో అవకతవకలు ఏర్పడ్డాయని ప్రముఖ వార్తా సంస్థ తన కథనాల్లో పేర్కొంది.


Also Read: డోలో650 తయారీ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు!

Advertisement

Next Story

Most Viewed