- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బన్నీకి షాక్ ఇచ్చిన 'పిల్ల పేట రౌడీ బాయ్స్'.. అతని డైలాగ్‌తోనే..
దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి తెలియంది కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బన్నీ స్టెప్పులు, మాస్ యాక్టింగ్‌ను ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 'పుష్ప' చిత్రంతో ఆయన ఫాలోయింగ్ పీక్స్‌కు చేరింది. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం, డైలాగ్స్ ఇండియా మొత్తాన్ని ఊపేశాయి. ప్రత్యేకించి 'తగ్గేదే లే' డైలాగ్ ఫీవర్.. గల్లీ పోరల నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్ల వరకు ప్రతీ ఒక్కరినీ టచ్ చేసింది. ఇప్పుడు మూడేళ్ల పిల్లలు కూడా 'తగ్గేదే లే' అంటూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. అయితే ఈ రోజు అల్లు అర్జున్ బర్త్‌డే కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బన్నీకి విషెస్ తెలుపుతూ ఫ్లెక్సీ డిజైన్ చేయించిన కొందరు పిల్లలు.. దానిపై 'పిల్లపేట రౌడీ బాయ్స్.. తగ్గేదే లే!' అనే డైలాగ్ జోడించడం విశేషం.
ఈ పోస్టర్‌ను ఓ సామాజిక వేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇదే అవకాశంగా తీసుకున్న నెటిజన్లు.. కుప్పలు కుప్పలుగా మీమ్స్‌తో అదరగొడుతున్నారు. ఈ మేరకు బన్నీకి పిల్లల్లోనూ క్రేజ్ ఎక్కువేనని కామెంట్ చేస్తూ ఇంకో పదేళ్ల తర్వాత ఈ అభిమానం ఆకాశాన్ని తాకేలా ఉందని అభిప్రాయపడుతున్నారు.