'మహనీయులు నడయాడిన నేలపై అడుగులు వేయడం నా అదృష్టం'

by GSrikanth |
మహనీయులు నడయాడిన నేలపై అడుగులు వేయడం నా అదృష్టం
X

దిశ, తుంగతుర్తి: బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అత్యంత ఎత్తైన గుట్టను సులువుగా ఎక్కి బుద్ధుడు నెలవైన ప్రాంతంలో తన సందేశంతో జ్ఞాన బోధన చేశారు. అనంతరం బుద్ధుని పంచశాల గుట్టపై ధర్మంకోసం ప్రార్థన చేశారు. గుట్టపై ఉన్న బుద్ధ శిలలు, చరిత్రకు సాక్ష్యంగా ఆనవాళ్లతో నిలిచిన గదులు, తదితర వాటిని పరిశీలించి వాటి చరిత్రను తెలుసుకుంటూ తన్మయత్వం పొందారు. మహనీయులు నడయాడిన నేలపై అడుగులు వేయడం తన అదృష్టంగా భావించిన ప్రవీణ్ కుమార్ శిరస్సు వంచి మదిలో కీర్తించుకున్నారు. ముఖ్యంగా బుద్ధ క్షేత్రాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావించారు. అనంతరం గుట్టల కింద స్వేరో గీతాల మధ్య పుస్తక పఠణాలు అరగంట పాటు కొనసాగాయి. అక్షరం,ఆయుధం, ఆర్థికానికి తోడుగా, కొత్తగా ఆత్మగౌరవ అధికారం సాధించాలంటూ భీమ్ దీక్ష శిబిరం భావితరానికి పిలుపునిచ్చింది.

Advertisement

Next Story