Alia Bhatt: ‘ఆ విషయంలో మేం ఇప్పటికి క్లారిటీగా ఉన్నాం’ కుమార్తెపై అలియా షాకింగ్ కామెంట్స్..

by Anjali |
Alia Bhatt: ‘ఆ విషయంలో మేం ఇప్పటికి క్లారిటీగా ఉన్నాం’    కుమార్తెపై అలియా షాకింగ్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ హీరో-హీరోయిన్ అయిన అలియా భట్(Alia Bhatt) అండ్ రణబీర్ కపూర్(Ranbir Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అలియా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే తన క్యూట్ నెస్, అందం, నటన, డ్యాన్స్, టాలెంట్‌తో మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ అయిన రణబీర్‌తో ప్రేమలో పడి.. కుటుంబీకుల సమక్షంలో వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరు నవంబరు 2022 లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాహా(Raha) పిక్స్ ఎప్పటికప్పుడు అలియా భట్, రణబీర్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. ఈ చిన్నారి ఫొటోలు, వీడియోలు చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతారు. అచ్చం అలియాలాగే ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తారు.

అయితే ఈ స్టార్ కపుల్ కు రాహా ఫొటోలు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు వైరల్ కాకూడదని నిర్ణయించుకున్నామని ఇప్పటికే ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అలియా ఓ ఇంటర్వ్యూకు హాజరవ్వగా.. రాహా గురించి మాట్లాడింది. తన కుమార్తె జన్మించినప్పుడే సోషల్ మీడియాకు దూరంగా ఉంచుదామనుకున్నామని తెలిపింది. ఈ విషయంలో రణబీర్ నేను ఫుల్ క్లారిటీగా ఉన్నామని చెప్పింది. కానీ అనుకోకుండా మేము అనుకున్న దానికంటే ముందే తను జనాలకు దగ్గరైందని వెల్లడించింది. అలాగే రాహా పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకోలేదని తెలిపింది. కానీ మొదట్లో తన కుమార్తె ఫొటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో చాలా ఫీల్ అయ్యానని.. ప్రజెంట్ కూడా ఈ విషయంలో కంఫర్ట్ గా లేనని అలియా వివరించింది. అలాగే ప్రజలంతా రాహా మీద చూపుతోన్న ప్రేమాభిమానాలకు చాలా హ్యాపీగా ఉందంటూ థ్యాంక్స్ చెప్పింది అలియా. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story