నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్

by samatah |
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం జరగనున్నది. పార్లమెంటు అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటిపై జరిగే చర్చలో పాల్గొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నది. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపికచేసే విషయాన్ని కూడా చర్చించనున్నది. ఈ సమావేశం తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును అధికారికంగా ఎన్డీఏ తరఫున ప్రకటించే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story