- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ బలహీతన అదే.. దాని మనం దరిచేరనివ్వొద్దు: బీజేపీ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్‌పై జనంలో వ్యతిరేకత నెలకొందని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్సంతోష్వ్యాఖ్యానించారు. కేసీఆర్ప్రధాన బలహీనత అహంకారమేనని, ఆ అహంకారం బీజేపీలో ఉండకూడదని బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అహంకారం ఎక్కువయ్యే కొద్దీ పతనం మొదలవుతుందని, పార్టీ నేతలు నిరంరతం ప్రజల్లో ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలని, కేవలం ఎన్నికల సమయంలోనో, పబ్లిక్ మీటింగ్‌లకే పరిమితం కావొద్దని దిశానిర్దేశం చేశారు. బీజేపీ అధికారంలోకి రాబోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని, అందరూ అప్రమత్తంగా ఉంటూ పనిచేయాలని హెచ్చరించారు.
కొత్త-పాత తేడాలు పక్కన పెట్టాలని, రాబోయే రోజుల్లో చాలామంది ముఖ్య నాయకులు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మీటింగులకు చిన్న చిన్న హాళ్లు సరిపోవని, పెద్ద పెద్ద సమావేశ మందిరాల అవసరం ఏర్పడనుందని పేర్కొన్నారు. పార్టీలో పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని, వారు ఎక్కడున్నా గుర్తిస్తామని భరోసా కల్పించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న పనులు, పథకాలను ఇక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సంతోష్దిశానిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు దళిత మహిళలతను మంత్రులు చేశామనే విషయాన్ని తెలంగాణ జనాల్లోకి తీసుకెళ్లి, ప్రజలను బీజేపీ వైపునకు తిప్పుకోవాలని సూచించారు. నాయకులు చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి తమ వద్ద రిపోర్ట్ ఉంటుందని, దాని ఆధారంగానే అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి మళ్లీ లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. అయినా ఎవరూ భయపడకుండా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా సీఎంగా చేసేది తెలంగాణకు చెందిన వారినే అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. పార్టీని గెలిపించాలనే లక్ష్యం తప్ప వ్యక్తిగతంగా ఎదగాలనే భావన నాయకులకు ఉండొద్దని హెచ్చరించారు.
బీజేపీ ఆర్గనైజింగ్‌సెక్రటరీ బీఎల్సంతోష్సమావేశం ప్రారంభమైన వెంటనే తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది? బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో మీడియా, సోషల్ మీడియా పాత్ర ఏమిటి? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఏయే చర్యలు తీసుకోవాలి? అనే అంశంతోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, పార్టీ ప్రచారం తీరుతెన్నుల వంటి అంశాలపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా తెలంగాణలో బీజేపీపై సానుకూల వాతావరణం నెలకొందని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందనే భావన ఉద్యోగుల్లో కూడా ఏర్పడిందని సంతోష్‌కు వివరించారు. అవినీతి కుటుంబాన్ని ఎప్పుడు జైల్లో వేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయని ఆయన దృష్టికి నేతలు తీసుకెళ్లారు. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయించుకున్న సర్వే నివేదికలతో భయపడుతున్నారని వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. నాయకులు రాష్ట్ర నాయకత్వం ఇచ్చే కార్యక్రమాలకే పరిమితమవుతున్నారని, స్థానిక సమస్యలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించాలని, వెంటనే వాటిపై ఉద్యమాలు చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలుచేయాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, ఎక్కడికి వెళ్లినా జనం విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందరూ కష్టపడాలని సూచనలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్‌పై జనంలో వ్యతిరేకత నెలకొందని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆరేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్సంతోష్వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచనలు చేశారు. దళితుబంధు స్కీంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు, అనుచరులకే తప్ప అర్హులకు ఈ పథకం అందడంలేదన్నారు. దీనిపై ఎక్కడికక్కడ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలతోపాటు తెలంగాణ ప్రజలకు ఏయే విషయాల్లో అన్యాయానికి గురవుతున్నారో గుర్తించి వారికి న్యాయం జరిగే వరకు ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్ రావు, శాసనసభాపక్ష నేత రాజాసింగ్, తమిళనాడు సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, జి.వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.