భార్య మృతి, భర్త పరిస్థితి సీరియస్.. రీజన్ తెలిస్తే షాకవుతారు!

by S Gopi |   ( Updated:2022-03-16 02:37:12.0  )
భార్య మృతి, భర్త పరిస్థితి సీరియస్.. రీజన్ తెలిస్తే షాకవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: 'సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. కానీ, వాటిని పెద్దవిగా చేసుకుని అనవసరంగా పోట్లాడకూడదు' అని మన పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడెందుకు ఇది గుర్తుచేస్తున్నాంటే.., బీహార్ లో ఓ ఘటన జరిగింది. ఓ చిన్న గొడవ కారణంగా భార్యాభర్తలు విషం తాగారు. దీంతో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి సీరియస్ గా ఉంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ లోని భాగల్పూర్ కు చెందిన ఓ వ్యక్తికి ఏడాది క్రితం పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి కూడా భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే, భోజనం చేస్తున్న సమయంలో తనకు మంచినీళ్లు ఇవ్వకుండా ఫోన్ లో మాట్లాడుతూ పట్టించుకోవడంలేదని ఆగ్రహంతో భార్యను కొట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య విషం తాగింది. అది చూసిన భర్త కూడా విషం తాగాడు. వీరిద్దరినీ గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, భార్య మృతిచెందింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement

Next Story

Most Viewed