బిగ్‌బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ "గే" నా.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజం.?(వీడియో)

by Kavitha |   ( Updated:2024-10-24 15:51:02.0  )
బిగ్‌బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ గే నా.. వెలుగులోకి వచ్చిన సంచలన నిజం.?(వీడియో)
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన నాగ మణికంఠ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హౌస్‌లో అడుగుపెట్టిన ఫస్ట్ వీకే ఫుల్ నెగెటివిటీ తెచ్చకున్నాడు. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా ఈయనను దూరం పెట్టారు. దీంతో ఒంటరిగా ఉన్న మణికంఠను చూసి ప్రేక్షకులందరూ అయ్యో పాపం అంటూ ఓట్లు వేశారు. అలా ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పదేపదే తన భార్య, బిడ్డ గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంటే చాలా మంది ఈయనకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. దీంతో మణికంఠ నామినేషన్స్‌లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులు ఓట్లు వేసి సేవ్ చేశారు. ఇక ఏడో వారంలో కూడా మణికంఠ వెళ్లిపోయేవాడు కాదు. కానీ, ఆయనే తన హెల్త్ సహకరించడం లేదని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.

ఇదిలా ఉంటే.. సాధారణంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్‌ను చాలా చానల్స్ వారు ఇంటర్వ్యూలు చేస్తారు. అలా ఇంటర్వ్యూలో పాల్గొన్న వారు.. హౌస్‌లో మనకు తెలియకుండా జరిగిన సన్నివేశాలతో పాటు కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడిస్తారు. ఇక నాగమణికంఠ కూడా హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీసెంట్‌గా ఓ చానల్ వాళ్లకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అలా వెళ్లిన టైంలో ఇతనికి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే..

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో నాగమణికంఠను యాంకర్.. మీరెందుకు హౌస్‌లో ఉన్న ఆడవాళ్ళందరితో అలా ప్రవర్తించారు. మీరు వారితో ప్రవర్తించిన తీరు పై చాలామంది వ్యతిరేకించారు. మీపై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. అలాగే మీపై వచ్చే ట్రోల్స్ మీద కామెంట్ బాక్స్ చూస్తే మాత్రం మీరు ‘గే’ అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి అని అడుగగా.. దానికి నాగ మణికంఠ స్పందిస్తూ.. “నాపై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా నేను వాటిని పట్టించుకోను. నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళకముందు ప్రతి చిన్న విషయానికి ఏడ్చే వాడిని. కానీ, ఇప్పుడు హౌస్ నుండి బయటకు వచ్చాక అలాంటి వాటిని పట్టించుకోవడం లేదు. ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోను" అంటూ నాగ మణికంఠ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

(video link credits to iDream Media youtube channel)

Advertisement

Next Story