Bigg Boss 8 Telugu: వన్ సైడ్ లవ్‌కు బ్రేకుల్లేవ్.. నెట్టింట దుమారం రేపుతోన్న లేడీ కంటెస్టెంట్ ఓపెన్ స్టేట్‌మెంట్

by Anjali |
Bigg Boss 8 Telugu: వన్ సైడ్ లవ్‌కు బ్రేకుల్లేవ్.. నెట్టింట దుమారం రేపుతోన్న లేడీ కంటెస్టెంట్ ఓపెన్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లో ప్రతి సీజన్‌లోనూ ప్రేమ కథలు సర్వసాధారణంగా మారిపోయాయి. వీరి లవ్ స్టోరీలు కొంతమంది బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయగా.. మరికొంతమంది నెటిజన్లకు విపరీతమైన ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. అయితే ఏ సీజన్‌లో కూడా జరగని ఓ డిఫరెంట్ ప్రేమ కథ బిగ్‌బాస్ సీజన్-8 లో నడుస్తోంది. చాలా వరకు అయితే కామన్‌గా ఒక అబ్బాయే అమ్మాయి వెనకాల తిరిగి మరీ ఇష్టపడుతారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూశాం.

కానీ ఇక్కడ ఒక అమ్మాయే అబ్బాయిపై పిచ్చి ప్రేమ పెంచుకుని.. అతడి కారణంగా ఎంతమంది దూరం పెట్టినా.. ఈ లేడీ కంటెస్టెంట్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. మరీ ఈ కంటెస్టెంట్ ఎవరనీ అనుకుంటున్నారా..? బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya). ఈమె గత కొద్ది వారాల నుంచి తోటి కంటెస్టెంట్ పృథ్వీ(prudhvi)ని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కంటెస్టెంట్లు విష్ణుప్రియను నామినేట్ కూడా చేశారు. ప్రతి విషయంలోనూ పృథ్వీకి సపోర్ట్ చేయడం నచ్చట్లేదంటూ రోహిణి(rohini) విష్ణుప్రియను నామినేట్ చేసింది.

‘‘పోయిన వారం మెగా చీఫ్ టాస్కు(Mega chief task)లో తన దగ్గరకకు వెళ్లి సపోర్ట్ చేయమని అడిగాను. విష్ణుప్రియ ఓకే అని చెప్పింది. కానీ టాస్క్ స్టార్ట్ అయ్యాక పృథ్వీకి మద్ధతు పలికింది. తన బిహేవియర్ నాకు నచ్చలేదు. అందుకే నామినేట్ చేశాను’’అంటూ రోహిణి,, విష్ణుప్రియను నామినేట్ చేశాక కారణం చెప్పింది. దీంతో అక్కడ రోహిణి-విష్ణుప్రియ మధ్య చిన్నగా వివాదం జరుగుతోంది. రోహిణి అన్న మాటల వెనక అర్థం నాకు తెలుసునంటూ విష్ణుప్రియ అంటుంది. అవును అందుకే మెగా చీఫ్ టాస్కులో సపోర్ట్ చేయలేదని చెబుతుంది.

అలాగే చివర్లో కంటెస్టెంట్లతో పాటు.. బిగ్‌బాస్ ప్రియులు షాకయ్యేలా ఓ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. పృథ్వికి, తనకు మనస్పర్థలు వచ్చినా.. ఎలాంటి గొడవలు అయినా నా మొదటి ప్రిపరెన్స్ ఎప్పుడూ పృథ్వికే అంటూ గట్టిగా చెప్పేసి వెళ్లిపోయింది. దీంతో నెటిజన్లు.. వన్ సైడ్ లవ్‌కు బ్రేకుల్లేవ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వీక్ నామినేషన్స్‌లో పృథ్వి(prudhvi), యష్మీ(yashmi), గౌతమ్(goutham), అవినాష్(avinash), తేజ (theja), విష్ణుప్రియా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed