ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు: మహేశ్‌ బిగాల

by GSrikanth |
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు: మహేశ్‌ బిగాల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తెలంగాణ విద్యార్థులందరినీ చదివిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించడంపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నారైల తరఫున సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యుద్ధం కారణంగా తెలంగాణకు చెందిన 740 మంది మెడిసిన్‌ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. వారి చదువుకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని సీఎం చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దేశంలో ఏ సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కొనియాడారు.

Advertisement

Next Story