- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanjay Raut : ఎంవీఏ కూటమిని వీడేందుకు సిద్దమన్న సంజయ్ రౌత్
ముంబై: MP Sanjay Raut Says, Shiv Sena Ready To Walk Out From MVA| శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తే మిత్ర పక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీలను వదులుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకాకుండా 24 గంటల్లో గౌహతి నుంచి ముంబైకి రావాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రెబల్స్ తిరిగివస్తే మహావికాస్ అగాధీ కూటమి నుంచి బయటకు వస్తామని అన్నారు. గౌహతి నుంచి ఎమ్మెల్యేలతో సరైన కమ్యూనికేషన్ లేదు. ముంబై వచ్చి సీఎంతో చర్చలు జరపండి. మేము ఎంవీఏ కూటమి నుంచి ఎమ్మెల్యేలు అందరితో బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, మీరు ఇక్కడికి వచ్చి సీఎంతో చర్చించాల్సి ఉంది' అని పేర్కొన్నారు. అయితే సీఎం ఠాక్రే అధికార నివాసాన్ని వీడినప్పటికీ త్వరలోనే తిరిగి వస్తారని చెప్పారు. రెబెల్ ఎమ్మెల్యేలంతా హిందుత్వ అంశాన్ని లేవనేత్తారని చెప్పారు. చర్చలకు రావాలని కోరారు. తాము షిండే బృందంలోని 22 మంది ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నామని చెప్పారు. మరోవైపు తాము 42 మంది బృందంతో అసోంలోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్నామని షిండే ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. వీరిలో 35 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, ఏడుగురు స్వతంత్రులు ఉన్నారు.
- Tags
- Sanjay Raut