స్త్రీలు లైంగిక దాడి గురించి చెప్పేందుకు భయపడుతున్నారు.. స్టార్ నటి

by Harish |
స్త్రీలు లైంగిక దాడి గురించి చెప్పేందుకు భయపడుతున్నారు.. స్టార్ నటి
X

దిశ, సినిమా: మలయాళ నటి భావన తనపై జరిగిన లైంగిక దాడి గురించి మరోసారి స్పందించింది. అంతేకాదు తనలాగే లైంగిక దాడికి బలైన ఎంతో మంది మహిళల జీవితాలు తలకిందులైనాయన్న భావన.. ఇలాంటి సంఘటనలు ఎంతో భయంకరమైన పీడకలల వంటివని పేర్కొంది. 'ఈ కేసు విచారణలో భాగంగా 15 రోజులు కోర్టులోనే పూర్తి సమయం గడపాల్సి వచ్చింది. నేను అబద్ధాలు చెబుతున్నాననే నిందను మోపుతూ నా పేరెంట్స్‌ను కూడా అవమానించారు. ఆ సమయంలో నేను ఒంటరిగా మిగిలాననే బాధతో ఎంతో కృంగిపోయాను. కానీ, ఏ తప్పు చేయని నేను.. బాధితురాలిని కాదు పోరాట యోధురాలినని నన్ను నేను ఉత్సాహ పరుచుకున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఎంతోమంది మహిళలు ఇంతకుమించి జరుగుతున్న ఘోరమైన ఘటనలను బయట పెట్టేందుకు భయపడుతున్నారన్న నటి.. బాధితుల తరపున పోరాటం చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Next Story