- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరిలో కలిసిపోయిన భద్రాచలం (ఫొటోలు)
దిశ, వెబ్‌డెస్క్, భద్రాచలం :వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు భద్రాద్రిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వర్షాలకు తోడు ఎగువ నుంచి భారీగా వరదలు వస్తుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం రికార్డు స్థాయిలో ప్రవహిస్తోంది. 36 ఏళ్ల తర్వాత మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చి.. 70 అడుగులను దాటి ఉరకలు వేస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం వరకే ఈ రికార్టును చెరిపేయగా.. రాత్రి వరకు 75 అడుగుల వరకు నీటి మట్టం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ఉధృతి అధికం కావడంతో భద్రాచలం పట్టణం నీట మునిగింది. రెండు రోజులు క్రితమే లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా.. శుక్రవారం తెల్లవారు జాము వరకు ఎగువ ఉన్న ప్రాంతాలను సైతం వరద నీరు చుట్టుముట్టింది. ప్రస్తుతం గోదావరి, భద్రాచలం పట్టణం రెండు కలిసి పోయాయి. రోడ్లు, వీధులు, రామాలయం మాడ వీధులు పూర్తిగా నీట మునిగాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో కలిసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తలిస్తూ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.