- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vatayanasana: వటయనాసనం.. దీని వల్ల ఉపయోగం ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్: Benefits Of Vatayanasana Yoga| మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లను ముందుకు చాచి రిలాక్స్ పొజిషన్‌లో కూర్చోవాలి. తర్వాత కుడి కాలు పాదాన్ని ఎడమ కాలు తొడపై పొట్టకు దగ్గరగా తీసుకొచ్చి బలంగా ఆన్చాలి. అలా పాదం కదలకుండా కుదురుకున్నాక ఎడమకాలు మోకాలి దగ్గర మడిచి పిరుదులపై బాడీ బ్యాలెన్స్ వేసి కూర్చోవాలి. ఇప్పుడు రెండు చేతులను నేలపై బలంగా ఆన్చి కుడికాలి మోకాలును నేలపై ఆన్చాలి. ఈ భంగిమలో వెన్నుపూస నిటారుగా ఉండాలి. తల ముందుకు చూస్తుండాలి. ఎడమకాలు పాదం నేలపై కుడికాలి మోకాలు ప్యారలల్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు చేతులను జోడించి పాములు అల్లుకున్నట్లు మెలిక తిప్పాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగి మళ్లీ మరో కాలుతో ప్రయత్నించాలి.
ప్రయోజనాలేంటి?
* కండరాల పట్టువిడుపులకు మేలు.
* ఎముకలను బలపరుస్తుంది
* రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
* సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతుంది.
- Tags
- Vatayanasana
- Yoga