రేషన్ షాపుల్లో బ్యాంకు లావాదేవీలు

by Manoj |
రేషన్ షాపుల్లో బ్యాంకు లావాదేవీలు
X

న్యూఢిల్లీ : దేశంలో గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో బ్యాంకు లావాదేవీలను నిర్వహించేందుకు త్వరలోనే చర్యలు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలను కామన్ సర్వీస్ సెంటర్లుగా గుర్తించి అందులో ఉద్యోగులను 'బ్యాంకు మిత్ర' అనే పేరుతో నియమించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆహారశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టేందుకు అన్ని రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ లేఖలు కూడా రాసింది.

దీని ద్వారా గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వ్యవస్థ పనితీరు, రేషన్ షాపులకు బ్యాంకులు ఎలా సహాయం చేస్తాయి. పనికి ఎంత కమిషన్ ఇస్తారు? తదితర అంశాలపై చర్చించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ షాపు సంస్థల అగ్రనేతలను ఢిల్లీ నుంచి ఆహ్వానం కూడా అందింది. వీరు ఇప్పటికే కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్నతాధికారులలో ఒకరైన కన్వల్‌జిత్ షోర్‌తో సమావేశమైనట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇతర బ్యాంకులతో కూడా చర్చలు జరిపేందుకు ఆహార శాఖ సిద్ధంగా ఉన్నదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed