భారతీయులను తీసుకొచ్చేందుకు చ‌ర్య‌లు: బండి సంజయ్

by Web Desk |
BJP leader Bandi Sanjay
X

దిశ, తిమ్మాపూర్: ఉక్రెయిన్‌లో ఉన్న 20 వేలకు పైగా భారతీయుల ఇబ్బందులను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వెంటనే స్పందించి రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న పరిస్థితులను సమీక్షించి, భారతీయులను కాపాడే దిశగా చర్యలు మొదలు పెట్టారని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఉక్రెయిన్ వెళ్లిన పలువురు విద్యార్థుల కుటుంబాలను కలిసి, వారికి భరోసా కల్పించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా వీడియో కాల్ లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నామ‌ని తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అన్ని దేశాల విజ్ఞప్తి మేరకు సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయడం లేదని రష్యా హామీ ఇచ్చిందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతీయులను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత ప్రధానిపై ఉంద‌ని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విద్యార్థులకు ధైర్యం చెబుతున్నామన్నారు. అక్కడ భయానక వాతావరణం ఉన్నట్టు సోషల్ మీడియాలో ఎవరూ దుష్ప్రచారం చేయొద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed