Nandamuri Balakrishna: ఫస్ట్ రోజు నైట్ చాలా ఇబ్బంది పడ్డాను.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by sudharani |   ( Updated:2024-10-22 08:15:38.0  )
Nandamuri Balakrishna: ఫస్ట్ రోజు నైట్ చాలా ఇబ్బంది పడ్డాను.. సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ (Unstoppable with NBK). ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో.. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని 4వ సీజన్‌లోని ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ 4వ సీజన్‌కు సంబంధించిన మేకింగ్ ట్రైలర్ (Making Trailer) ను కూడా తాజాగా రిలీజ్ చెయ్యగా.. నెట్టింట విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే అందరూ ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్న అన్‌స్టాపబుల్ (Unstoppable) ఫస్ట్ ఎపిసోడ్ (First Episode)కు సంబంధించిన ప్రోమో (promo) రానే వచ్చింది.

ఫస్ట్ ఎపిసోడ్‌కు ఏపీ (AP) సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హాజరు కాగా.. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే క్రమంలో గత ఏడాది ఆయనను జైలులో పెట్టినప్పటి విషయాలకు సంబంధించి కూడా పలు కామెంట్స్ (Comments) చేశారు సీఎం చంద్రబాబు. జైల్లో పెట్టిన ఫస్ట్ రోజు ఎంత తలుపులు కొట్టిన తియ్యలేదు అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. ‘భూమికి సూర్యచంద్రులు ఎలాగో.. ఏపీకి చంద్రబాబు, కల్యాణ్ బాబు అలాగా’ అని ప్రజల అభిప్రాయం అంటూ బాలయ్య బాబు అనగా.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు చంద్రబాబుకు మధ్య ఏర్పడిన స్నేహం (friendship) గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు సీఎం. ప్రజెంట్ ఈ ప్రోమో నెట్టింట వైరల్ (viral) అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed