- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్సర్ మోడల్ బైక్‌ల ధరలు పెంచిన బజాజ్ ఆటో!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పోర్ట్‌ఫోలియోలోని పలు బైకుల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన పల్సర్ మోడల్‌లోని పల్సర్ ఎన్250, పల్సర్ ఎఫ్250 మోటార్‌సైకిళ్ల ధరను పెంచింది. పల్సర్ 220ఎఫ్ ధరను రూ. 660 పెంచింది. దీంతో ఈ బైక్ ధర ఇప్పుడు రూ. 1.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఎఫ్ 250 బైకు ధరను రూ. 915 పెంచుతున్నట్టు కంపెనీ పేర్కొంది. దీంతో బైక్ ధర రూ. 1.41 లక్షలుగా, ఎన్ 250 మోడల్ రూ. 1,180 పెంపుతో రూ. 1.39 లక్షల వద్ద లభిస్తుందని తెలిపింది. గడిచిన ఏడాది కాలంలో కంపెనీ తన ఉత్పత్తుల ధరలను పలుమార్లు పెంచింది. 2021లో పల్సర్ 250 ధరను పెంచింది. ఇదే సమయంలో కంపెనీ ఇటీవల ఆదరణ పెరుగుతున్న ఎలక్ట్రిక్ బైకుల విభాగంలో దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పూణె ప్లాంట్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. ఈ ప్లాంట్ నుంచే కంపెనీ తన ఎవర్‌గ్రీన్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకురానుంది. రానున్న రోజుల్లో ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 5 లక్షల స్కూటర్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది.