బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి..! లేకపోతే...

by S Gopi |
బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి..! లేకపోతే...
X

దిశ, శంకరపట్నం: ఖాతాదారులు అప్రమత్తంగా ఉండి, బ్యాంకు వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నాగేంద్ర అన్నారు. గురువారం మండలంలోని అంబాల్ పూర్ గ్రామంలో బ్యాంకు ఖాతా దారులకు ఆర్థిక లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు బ్యాంకు సేవల పై అవగాహన కల్పించి ,బ్యాంకు సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని ,ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముంజ వసత వెంకటేశం, ఉప సర్పంచ్ మడ్డి రవి, బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story