వాహనాల ప్రదర్శన కార్యక్రమం 'ఆటో ఎక్స్‌పో'.. వచ్చే ఏడాది జనవరి

by Vinod kumar |
వాహనాల ప్రదర్శన కార్యక్రమం ఆటో ఎక్స్‌పో.. వచ్చే ఏడాది జనవరి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రముఖ వాహనాల ప్రదర్శన కార్యక్రమం 'ఆటో ఎక్స్‌పో' వచ్చే ఏడాది జనవరిలో 13-18వ తేదీల మధ్య నిర్వహించనున్నట్టు వాహన తయారీ కంపెనీల సంఘం (సియామ్‌) తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమ కొవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దు చేయబడింది. అంతర్జాతీయంగా కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో చివరిసారిగా 2020, ఫిబ్రవరిలో ఆటో ఎక్స్‌పో కార్యక్రమం జరిగింది.


2023, జనవరి 13-18 మధ్య ఇండియా ఎక్స్‌పో మార్ట్ గ్రేటర్ నోయిడాలో నిర్వహించాలని నిర్ణయించాం. జనవరి 11న మీడియా కోసం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత 12న ప్రారంభ వేడుక, ప్రత్యేక అతిధులు, డీలర్ల కోసం కార్యక్రమం ఉంటుందని ' సియామ్ డైరెక్టర్ రాజేష్ మీనన్ అన్నారు. అలాగే ఆటో కాంపోనెంట్స్ షో కూడా అదే తేదీల్లో జరగనుంది.


ఆటో ఎక్స్‌పోలో పాల్గొనబోయే ఎగ్జిబిటర్లు, సందర్శకులు, వాటాదారులకు భద్రత విషయంలో సియామ్ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ ఆటో ఎక్స్‌పోలో దాదాపు 70 కొత్త వాహనాల లాంచ్‌లతో పాటు 352 వాహనాల ప్రదర్శనలు ఉంటాయని సియామ్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed