- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణంమీదకొచ్చిన కాలువ.. రైతు ఆత్మహత్యాయత్నం
by GSrikanth |
X
దిశ, రామడుగు: ప్రభుత్వ పథకం ప్రాణం మీదకొచ్చిందన్న ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒంటెల రాఘవరెడ్డి(52) వరద కాలువలో భాగంగా గతంలో మూడుసార్లు వ్యవసాయ భూమిని కోల్పోయాడు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న అదనపు టీఎంసీ (ఓటీ) కాలువలో భాగంగా మళ్లీ వ్యవసాయ భూమిని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదనకు గురై బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉన్న భూమిలో కొద్దిరోజుల క్రితమే అప్పు చేసి మరీ వ్యవసాయ బావిని తవ్వించి వ్యవసాయం చేసుకుందామని భావించాడు. ఈ క్రమంలో అదనపు టీఎంసీలో భాగంగా మళ్లీ నాలుగోసారి రాఘవరెడ్డి భూమి పోతుందనే వార్తను వినగానే మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Next Story