అర్ధ రాత్రి TRS నాయకుడి హల్ చల్.. అట్రాసిటీ కేసు నమోదు

by samatah |   ( Updated:2022-04-08 05:40:45.0  )
అర్ధ రాత్రి TRS నాయకుడి హల్ చల్.. అట్రాసిటీ కేసు నమోదు
X

దిశ,మణుగూరు : టీఆర్ఎస్ నాయకుడుపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..టీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు మట్టపల్లి సాగర్ యాదవ్,అతని స్నేహితులు కలిసి గత కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి నడి రోడ్డుపై మద్యం పుచ్చుకొని డ్యూటీలో ఉన్న పోలీసులపై మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించాడు. అయితే పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యింది. ఈ క్రమంలో ఆ వీడియోను రామానజవారం ప్రాంతానికి చెందిన రాసమల్ల నాగరాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకుడు మట్టపల్లి సాగర్ యాదవ్ ఓ రోజు రాత్రి మద్యం మత్తులో రాసమల్ల నాగరాజు అనే దళితుడి ఇంటిపై దాడి చేశాడు. ఎందుకు సోషల్ మీడియాలో పోస్టు చేశావ్ అని ఇష్టం వచ్చినట్లు కొట్టి దూషించాడని నాగరాజు తెలిపారు.

ఈక్రమంలో రాసమల్ల నాగరాజు,అతని భార్య ఇద్దరు కలసి స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ ముత్యం రమేష్ దగ్గర ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అయితే విషయం తెలుసుకున్న మణుగూరు సబ్ డివిజన్ ఏఎస్పీ డాక్టర్ శబరిష్ రంగంలోకి దిగారు. ఈక్రమంలో ఏఎస్పీ శబరిష్ రాసమల్ల నాగరాజు ఇంటి వద్ద ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఎంక్వైరీలో దళితుడి ఇంటిపై టీఆర్ఎస్ నాయకుడు మట్టపల్లి సాగర్ యాదవ్ దాడి చేశాడని నిర్దారణ కావడంతో నాయకుడిపై ఏఎస్పీ శబరిష్ ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాడు. అయితే కేసు నమోదు అయిన తరువాత కొన్ని రోజులు ఆనాయకుడు తప్పించుకొని పారిపోయాడని కొంత సమాచారం.ఈక్రమంలో పోలీసులు రంగంలోకి దిగి నాయకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు గాలింపు చేస్తున్న తరుణంలో గురువారం ఆనాయకుడి ఆచూకీ తెలియడంతో పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను భద్రాచలం సబ్ జైలుకు తరలించారని కొంత విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story