- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒంటరితనంతో ఏనుగుల్లో పెరుగుతున్న ఒత్తిడి.. మనుషుల మాదిరిగానే..
దిశ, ఫీచర్స్: అందరితో కలిసున్నప్పుడు ఆనందంగా ఉండే మనిషి, ఒంటరిగా ఉండాల్సి వస్తే ఒత్తిడి, నిరాశకు లోనవుతుంటాడన్నది తెలిసిన విషయమే. అయితే ఒక కొత్త అధ్యయనం ప్రకారం, ఆసియా ఏనుగులతో పాటు కొన్ని జంతువులు కూడా మనుషుల మాదిరిగానే ఒంటరితనంలో భావోద్వేగ ఒత్తిడిని ప్రదర్శిస్తాయని వెల్లడైంది. ఈమేరకు మయన్మార్‌లోని ఆసియా ఏనుగులు.. ఆందోళన, ఒంటరితనం, నిరాశను అనుభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
టర్కు విశ్వవిద్యాలయ పరిశోధకులు మయన్మార్‌లోని 95 ఆసియా ఏనుగుల ప్రవర్తనపై చేసిన అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. ఏనుగులలో ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు వాటి మలంలోని స్ట్రెస్ హార్మోన్స్ లెవల్స్‌ను పోల్చారు. అంతేకాదు 2014 నుంచి 2018 వరకు ఏనుగుల హ్యాండ్లర్‌లతో మాట్లాడిన పరిశోధకులు.. వాటి సామాజిక పరస్పర చర్యల పై సమాచారాన్ని సేకరించారు. ఈ క్రమంలో ఆడ ఏనుగులతో పోలిస్తే మగ ఏనుగులు.. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయని వెల్లడించారు. కాగా వాటి గుంపులో పిల్లలు ఉన్నప్పుడు ఫిమేల్ ఎలిఫెంట్స్‌లో చాలా తక్కువ స్ట్రెస్ ఉంటుందని గుర్తించారు. అదేవిధంగా ఆసియా ఏనుగులు వాటి సహ- ఏనుగు జాతుల ఉనికి లేకపోవడం వల్ల కూడా ప్రభావితమవుతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఒంటరిగా ఉండే ఆడ ఏనుగులు ఒత్తిడి సంకేతాలను చూపుతాయని పరిశోధకులు ఊహించినప్పటికీ, ఇది ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండదని కనుగొన్నారు. మగ ఏనుగులతో పోలిస్తే, ఒంటరిగా ఉండే ఆడ జంతువులు బలమైన సామాజిక బంధాలను ఏర్పరచుకోకుండా ఇతర ఏనుగులతో సంభాషించగలవు. అందువల్ల ఆ బంధాలు లేకపోయినా అవి ఒత్తిడిని అనుభవించవు. అంతేకాదు మగ లేదా ఆడ ఏనుగులు సమూహాల సైజ్‌పై ఏమాత్రం ఆందోళన, ఒత్తిడికి గురికావని స్పష్టం చేశారు. ఇక స్ట్రెస్ లెవల్స్ మాత్రం వాటి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించిన పరిశోధకులు.. మానవుల మాదిరిగానే ఏనుగుల్లోనూ సామాజిక బంధానికి ఉన్న ప్రాముఖ్యతను ఈ పరిశోధన నిరూపిస్తుందని భావిస్తున్నారు.