Ashu Reddy: దుప్పట్లో ముద్దులాట.. బిగ్ బాస్ షోలో బూతు పురాణం

by samatah |   ( Updated:2022-08-11 07:18:10.0  )
Ashu Reddy: దుప్పట్లో ముద్దులాట.. బిగ్ బాస్ షోలో బూతు పురాణం
X

దిశ, సినిమా: ఈ మధ్య రియాలిటీ షోల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ జోకులకు అదుపులేకుండా పోతుంది. అమ్మాయి, అబ్బాయి అనే తేడాలేకుండా ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని పలు షోలతోపాటు తెలుగు బిగ్ బాస్ షోపై కూడా జనాలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీలో తెలుగు బిగ్‌బాస్‌ 24 గంటలు లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉండటంతో కంటెస్టెంట్లు ఏం మాట్లాడినా, ఏం చేస్తున్నా ప్రతీది ప్రేక్షకులు గమనిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాస్క్‌లో భాగంగా హాట్ బ్యూటీ అషూరెడ్డి హద్దులు మీరి బూతుపురాణం అందుకుంది. కంటెండర్స్‌ టాస్క్‌లో అఖిల్‌, బిందును ఒక టీమ్‌గా ఏర్పాటు చేయగా.. అఖిల్‌, బిందులకు ఫ్రూట్స్, జ్యూస్ కావాలని అడిగారు. దీంతో మధ్యలో కలగజేసుకున్న అషూ.. 'టాస్క్‌ ఆడుతున్నారా? లేక ఫస్ట్‌ నైట్‌కు వెళ్తున్నారా?' అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. దీనికి సమాధానంగా మరో కంటెస్టెంట్ అజయ్‌.. 'దుప్పట్లో దడదడే' అంటే 'ముసుగులో గుద్దులాట' ఎందుకంటూ మరోసారి రెచ్చిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుండగా.. ఒక అమ్మాయి మరో మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడుతుందా? అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story